పెళ్లైతే హీరోయిన్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడినట్టే. వెడ్‌లాక్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీస్ అక్క, అత్త రోల్స్‌కు షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇన్నాళ్లే ఇండస్ట్రీలో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ బ్రేక్ అవుతోంది. పెళ్లి తరువాత కూడా అందాల భామలు వెండితెరను రూల్ చేస్తున్నారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఆ జాబితాలో ఉన్నవారిలో ఒకరు కియారా అద్వానీ.
రీసెంట్‌గా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసిన క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ. తన మూవీ పార్టనర్ సిద్దార్థ్ మల్హాత్రాను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత కూడా ఫిలిం కెరీర్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. కనీసం పెళ్లి తరువాత హనీమూన్ బ్రేక్ కూడా తీసుకోకుండానే షూటింగ్‌లలో పాల్గొన్నారు కియారా.
పెళ్లి తరువాత కూడా ఫిలిం కెరీర్ కంటిన్యూ చేయటమే కాదు, గ్లామర్ విషయంలో తగ్గేదే లే అంటున్నారు ఈ బ్యూటీ. ఆఫ్టర్ మ్యారేజ్ సత్యప్రేమ్ కి కథ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో గ్లామర్ యాంగిల్ కూడా గట్టిగానే చూపించారు.
ప్రజెంట్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం స్పెషల్ ట్రీట్స్ ఇస్తున్నారు కియారా అద్వానీ.
వెండితెర మీద ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియా ప్రెజెన్స్‌ను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయటం లేదు కియారా అద్వానీ. పెళ్లి తరువాత కూడా వావ్ అనిపించే రేంజ్‌లో గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోస్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమాలు రిలీజ్‌కు ఉన్నా లేకపోయినా... ఆన్‌లైన్‌లో కియారా పేరు మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది.