
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మలయాళంలో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా మారి పలు చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీలోకి తెరంగేట్రం చేసింది.

తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇందులో సావిత్రి పాత్రలో జీవించి తెలుగు జనాల హృదయాలు గెలుచుకుంది. దీంతో దక్షిణాదిలో ఈ అమ్మడు పేరు మారుమోగింది. ఇటీవలే తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కీర్తి. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల బేబీ జాన్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి.. ఇప్పుడు కొత్త సినిమాలకు కమిట్ కాలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరోవైపు పలు యాడ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా కీర్తి బరువు పెరిగిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా కీర్తి మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత తాను బరువు పెరిగిన మాట నిజమేనని అన్నారు. అయితే బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్ గా మారడానికి పోరాడానని అన్నాుర. వారానికి 300 నిమిషాలువ వర్కవుట్స్ చేసి ఇప్పుడు 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చారు.

బరువు తగ్గాలనే ఆత్మ విశ్వాసం, తీవ్ర ప్రయత్నం, ఆహారపు కట్టుబాట్లు కలిస్తే ఫలితం తప్పకుండా ఉంటుందని అన్నారు కీర్తి. అలాగే ప్రస్తుతం కొత్త కథలను వింటున్నానని.. త్వరలోనే నూతన సినిమాకు సంబందించిన ప్రకటనలు వస్తాయని తెలిపారు.