
అందాలచిన్నది కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకొని, తన క్యూట్ నెస్‌తో ఆకట్టుకుంది.ఈ బ్యూటీకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక నేను శైలజా సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా క్యూట్‌గా కనిపిస్తూ, టాలీవుడ్ కుర్రకారు మనసు దోచుకుంది. ఇక ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

ఇక ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మహాటి మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోన్ అయిపోయింది. ఈ మూవీలో ఈ అమ్మడు అచ్చం సావిత్రిలా కనిపించడమే కాకుండా, తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

తర్వాత ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. మళ్లీ దసరా మూవీతో పాన్ ఇండియా లెవల్‌ల్లో క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరసగా సినిమాలు చేస్తూ, మంచి ఫామ్‌లో ఉంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా డ్రెండీ డ్రెస్‌లో, షాకింగ్ లుక్‌లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.