Keerthy Suresh: పెళ్లైనా.. తగ్గేదే లే అంటున్న కీర్తి సురేష్

| Edited By: Ram Naramaneni

Dec 22, 2024 | 9:37 PM

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత ఊరికే అనలేదు పెద్దలు. కీర్తి సురేష్ ఈ సామెతకు అర్థాన్ని చెప్తున్నారిప్పుడు. పెళ్లై రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే పర్సనల్ లైఫ్‌ను పక్కనబెట్టి ప్రొఫెషనల్‌గా తాను చేయాల్సిన న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్. మరి దానికి కారణమేంటో చూద్దామా..?

1 / 5

2 / 5
రెండు వారాలుగా సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నారు కీర్తి సురేష్. ఆ మధ్య బేబీ జాన్‌లో అదిరిపోయే హాట్ సాంగ్.. ఆ వెంటనే పెళ్లి న్యూస్.. వారం రోజులు ఆగి ప్రియుడితో గోవాలో పెళ్లి.. అంతలోనే ఇప్పుడు ప్రమోషన్స్.. ఇలా అస్సలు గ్యాప్ లేకుండా కుమ్మేస్తున్నారు కీర్తి.

3 / 5
మెడలో పసుపు తాడు.. మోడ్రన్ క్యాస్ట్యూమ్స్‌తో తెగ వైరల్ అవుతున్నారు ఈ భామ. పెళ్లి కోసం వారం రోజులు మాత్రమే గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్.. వెంటనే బేబీ జాన్ ప్రమోషన్స్‌లో జాయిన్ అయిపోయారు. ముంబైలో జరిగిన ప్రెస్‌మీట్‌లో కీర్తి అప్పియరెన్స్ అదిరిపోయింది.

4 / 5
డిసెంబర్ 25న బేబీ జాన్ రిలీజ్ కానుంది. వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ నిర్మాత.. ఆయన అసిస్టెంట్ కలీస్ దర్శకుడు. బేబీ జాన్ విడుదల తర్వాతే సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వనున్నారు కీర్తి. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ బ్యూటీ.

5 / 5
అప్పుడెప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రాణి, కన్నివేడి సినిమాల షూట్ చివరిదశకు వచ్చేసింది. ఇకపై మునపట్లా సినిమాలు చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతానికైతే ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు కీర్తి సురేష్.