
ఈ బ్యూటీ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రాలో జన్మించింది. ఇక్కడే పోవై లోని బొంబాయి స్కాటిష్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ కళశాలలో చేరి డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్‌తో మొదట ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.

కావ్య థాపర్ 2013 మొదట తత్కాల్ అనే హిందీ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. తర్వాత పతంజలి, మేక్ మై ట్రిప్ , కోహినూర్ వంటి సంస్థల్లో అడ్వర్టైజ్ మెంట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు కానీ, తర్వాత ఏక్ మిని కథ అనే సినిమా ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి, మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది.

విశ్వం, డబుల్ ఇస్మార్ట్ సినిమాల్లో నటించి తన అందం, నటనతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఈ అమ్మడుకు మంచి ఫేమ్ వచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ నటి తెలుగు, తమిళ, కన్న లో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా, పర్పుల్ కలర్ స్టైలిష్ డ్రెష్ ధరించి తన అంద చందాలతో అందరినీ మాచ చేస్తుంది. కొంటె చూపు చూస్తూ.. తన నవ్వుతో చంపేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.