
బాలీవుడ్ ఇండస్ట్రీ మరో సెలబ్రేషన్‌కు రెడీ అవుతుందా..? ఇదే ఇప్పుడు నార్త్ సర్కిల్స్‌లో మేజర్ డిస్కషన్. రీసెంట్‌గా క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

ఇప్పుడు మరో సెలబ్రిటీ జంటకు అమ్మా నాన్నల లిస్ట్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.ఆ మధ్య బాలీవుడ్‌లో వరుసగా పెళ్లి సందడి కనిపించింది. స్టార్ వెడ్డింగ్స్‌తో నార్త్ ఇండస్ట్రీ కళకళ లాడింది.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరేందుకు మన మల్లీశ్వరి కూడా రెడీ అవుతున్నారట. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, యంగ్ హీరో విక్కీ కౌషల్‌లను పెళ్లి చేసుకున్నారు కత్రినా.

ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు సెట్స్ మీద ఉండటంతో పెళ్లి తరువాత బ్రేక్ తీసుకోకుండా సినిమాలతో బిజీ అయ్యారు.రీసెంట్‌గా కత్రినా విక్కీ జోడీ పర్సనల్ లైఫ్‌లో బిగ్ డెసిషన్ తీసుకున్నారన్న న్యూస్ నార్త్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.

కమిట్ అయిన సినిమాలు పూర్తి కావటంతో పర్సనల్ లైఫ్‌లో ప్రమోషన్‌కు రెడీ అవుతున్నారట. ఆల్రెడీ కత్రినా ప్రెగ్నెంట్ అన్న న్యూస్ కూడా బీ టౌన్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

కత్రినా రీసెంట్ పిక్స్‌లో కాస్త లూస్‌గా ఉండే డ్రెస్సుల్లో కనిపిస్తుండటంతో బేబీ బంప్ కనిపించకుండా ఉండేందుకే ఆమె అలా మెయిన్‌టైన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయకపోయినా... త్వరలోనే కత్రినా, విక్కీలు కూడా ప్రౌడ్ పేరెంట్స్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

టాలీవుడ్ లో మల్లేశ్వరి గా పరిచయం అయ్యి తన అందంతో అందరిని ఆకర్షించిన అమ్మడు కత్రినా కైఫ్