
సినిమాలపై సినిమా తారలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. పలువివాదాలతో పాపులర్ అయ్యాడు క్రిటిక్ దర్శకుడు కత్తి మహేష్. రెండు వారాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డరు కత్తి మహేష్.

ముందు వెళ్తున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహేశ్ ను హుటాహుటిన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... ఫలితం దక్కలేదు.

అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మహేష్ కోలుకుంటారని ఆయన ఆరోగ్యం మెరుగుపెడుతుందని.. వైద్యులకు స్పందిస్తున్నాడని ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు తెలిపారు.

కానీ గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం విషమించిందని తెలుస్తుంది. కత్తి మహేష్ ఆరోగ్యం విషమించడానికి కారణం ఆయన లంగ్స్‌లోకి నీరు చేరడమే అని అంటున్నారు.

కత్తి మహేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.