కంగనా రనౌత్.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 4 నేషనల్ అవార్డులు అందుకుని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కంగన. లేడీ సూపర్ స్టార్‌గా వరస విజయాల్లో ఉన్న కంగనకు కొన్నేళ్లుగా టైమ్ అస్సలు కలిసి రావట్లేదు. భారీ ఆశలు పెట్టుకున్న తలైవి, ధాకడ్, చంద్రముఖి 2 నిరాశ పరిచాయి.
ఈ మధ్యే వచ్చిన చంద్రముఖి 2 సైతం నిరాశ పరిచింది. ఇటు సౌత్.. అటు నార్త్.. రెండో చోట్లా కంగనా చిత్రాలు ఆకట్టుకోవడం లేదు. దాంతో కంగనా మార్కెట్ దారుణంగా పడిపోతుంది.
ఇప్పటికప్పుడు హిట్ కొట్టకపోతే ఈ భామ కెరీర్‌కి ఎక్స్‌పైరీ డేట్ వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ తేజస్‌పైనే ఉన్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్‌గా ఇందులో నటిస్తున్నారు కంగన.
దేశం కోసం పోరాడే ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగన నటిస్తున్నారు. అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కంగన మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
అక్టోబర్ 20న విడుదల చేయాలి అనుకున్నా.. అదే రోజు టైగర్ ష్రాఫ్ గణపత్ ఉండటంతో 27కి వాయిదా వేసుకున్నారు. చూడాలిక.. ఈ సినిమా అయినా కంగనా కష్టాలు తీరుస్తుందో లేదో..?