Thug Life: కష్టాల్లో కమల్‌ హాసన్‌ థగ్‌లైఫ్.. బాక్సాఫీస్ వద్ద కనిపించని క్రేజ్..

Updated on: Jun 07, 2025 | 10:58 AM

ఇండియన్ 2 నిరాశపరిచిన కమల్‌ హాసన్‌, ఆ బాధను మరిపించేందుకు థగ్‌ లైఫ్ సినిమాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. నాయగన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ ఇది. క్రేజీ కాంబినేషన్‌లో డిఫరెంట్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో కమల్‌ బౌన్స్‌ బ్యాక్ అవుతారని అంతా అనుకున్నారు. మరీ జూన్ 5న విడుదలైన థగ్‌ లైఫ్ మూవీ టాక్ ఎలా ఉందో తెలుసుకుందామా.. ?

1 / 5
కమల్‌ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్‌ లైఫ్‌. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు ఆ రేంజ్‌ బజ్‌ మాత్రం రాలేదు. కానీ అనేక వివాదాల్లో మాత్రం చిక్కుకుంది.

2 / 5
ముఖ్యంగా చందనసీమలో సినిమా పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. కన్నడ భాష గురించి కమల్ చేసిన కామెంట్స్ సాండల్‌వుడ్‌లో వివాదానికి కారణమయ్యాయి. దీంతో సినిమాను బ్యాన్‌ చేసే వరకు వెళ్లింది పరిస్థితి. కమల్‌ కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. చివరకు కమల్ సైతం తగ్గలేదు.

3 / 5
తమిళనాడులోనూ ప్రీ సేల్స్‌ ఆశించిన స్థాయిలో కనిపించటం లేదు. ఇండియన్ 2 దారుణంగా ఫెయిల్ అవ్వటంతో ఆ ఎఫెక్ట్ థగ్‌ లైఫ్ మీద గట్టిగా కనిపిస్తోంది. మరి ఈ సిచ్యుయేషన్‌లో సినిమాకు హిట్ టాక్ రావాలి అంటే కంటెంట్ అద్భుతం అయితే తప్ప సాధ్యం కాదు.

4 / 5
ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మణిరత్నం మార్క్ మిస్సైందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. రోటీన్ స్టోరీ అని.. కేవలం తన యాక్టింగ్ తో మరోసారి కమల్ మ్యాజిక్ చేశారని అంటున్నారు నెటిజన్స్. అలాగే ఈ చిత్రం త్రిష పాత్రపై సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

5 / 5
ఈ చిత్రంలో త్రిష పాత్రతో మణిరత్నం ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన్ మ్యూజిక్ మాత్రం సినిమాకే హైలెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ థియేటర్లలో సందడి చేస్తుంది.