
ఎప్పుడైనా ఓ మంచి గ్రాఫ్‌ని క్రియేట్ చేయడం కష్టం అనుకుంటారు జనాలు. క్రియేట్ చేయడానికి ఎంత కష్టపడాలో, అది పడిపోకుండా... దాన్ని అలాగే మెయింటెయిన్ చేయడానికి కూడా అంతే కష్టపడాలి. గ్రాఫ్‌లో గ్రోత్ చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్ అండోయ్... ఈ విషయాన్ని లోకనాయకుడికి స్పెషల్‌గా చెప్పాలా ఏంటి? 2024 గ్రాఫ్‌ని, 25లో రెయిజ్ చేసే పనిలోనే ఉన్నారు కమల్.. మరి సాధ్యమేనా?

కల్కి సినిమా ఇచ్చిన జోష్‌లో ఉన్నారు కమల్ హాసన్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూ ఉంటే, ఒకటి కాకపోయినా ఒకటయినా క్లిక్ అవుతుంటే, రన్నింగ్‌లో ఉన్న మిగిలిన సినిమాల్లో ఓ ఉత్సాహం కనిపిస్తుందని నమ్ముతారు కమల్ హాసన్. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కల్కి సూపర్ సక్సెస్ అయింది. ఇండియన్ 2 ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అందరూ ఫ్లాప్ అయిన ఇండియన్ 2 మీద ఫోకస్ చేస్తుంటే, కమల్ మాత్రం రిలీజ్‌కి రెడీ అవుతున్న ఇండియన్ 3 మీద కాన్‌సెన్‌ట్రేషన్ పెంచారు. థర్డ్ పార్ట్ లో వీరశేఖరన్‌గా కమల్ ఎలా మెప్పిస్తారో చూడాలనే కుతూహలం ప్రేక్షకుల్లోనూ బాగానే ఉంది. అందుకే ఆడియన్స్ కి ఇంట్రస్ట్ పెంచేలా ఆ ప్రాజెక్ట్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట కమల్.

ఇటు మణిరత్నం థగ్ లైఫ్ షూటింగ్‌ని కూడా పూర్తి చేసేశారు. థగ్‌లైఫ్‌ని 2024లో రిలీజ్ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు మణి రత్నం. 2024లో థగ్‌లైఫ్ అండ్ ఇండియన్ 3 రిలీజ్ గ్యారంటీ. వాటి ప్రమోషన్లు చూసుకుంటూనే, కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ కాల్షీట్లు కావాలంటే ఇవ్వాల్సి ఉంటుంది లోక నాయకుడు.

ప్రస్తుతం తలైవర్ రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్, నెక్స్ట్ విక్రమ్ సీక్వెల్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సో.. కల్కి 2, విక్రమ్ 2 సినిమాల షూటింగులు, రిలీజులు... అటూ ఇటూగా ఒకే సమయంలో ఉండొచ్చన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్ న్యూస్.