
తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినపుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అనే డైలాగ్ ఉంది కదా..! భారతీయుడు 2 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చూసాక రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే అంటున్నారిప్పుడు.

తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినపుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా అనే డైలాగ్ ఉంది కదా..! భారతీయుడు 2 రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ చూసాక రామ్ చరణ్ అభిమానులు కూడా ఇదే అంటున్నారిప్పుడు.

కాల్షీట్ల సమస్యతో వెళ్లిన దుల్కర్ అండ్ రవి.. ఇప్పుడు మణి అండ్ కమల్ కోసం తిరిగి వచ్చేస్తున్నారు. వీరిద్దరికీ శింబు కూడా యాడ్ అయ్యారు. అందులోనూ థగ్‌లైఫ్లో ఆయనది డ్యూయల్ రోల్. పోస్ట్ ఎలక్షన్స్ వీళ్లందరితో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారవ్వడంతో.. మా గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాదాపు ఏడాది నుంచి ఇటు గేమ్ ఛేంజర్.. అటు భారతీయుడు 2లతో బిజీగా ఉన్నారు శంకర్.

నెలలో మొదటి 10 రోజులు ఓ సినిమా.. చివరి 10 రోజులు మరో సినిమా చేసారు. ఆగిపోయిన ఇండియన్ 2 సడన్‌గా స్టార్ట్ అవ్వడం గేమ్ ఛేంజర్‌పై ప్రభావం చూపించింది. అందుకే 2023లోనే రావాల్సిన సినిమా.. ఇంకా రాలేదు.

అక్టోబర్‌లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. భారతీయుడు 2తో పాటు 3 షూటింగ్ కూడా పూర్తి చేసారు శంకర్. మరోవైపు గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా 15 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

అన్నీ కుదిర్తే జూన్ 14న భారతీయుడు 2 రానుంది.. అక్టోబర్ 31న గేమ్ ఛేంజర్.. 2025 సమ్మర్‌లో భారతీయుడు 3 విడుదల చేయాలని చూస్తున్నారు శంకర్. అదే జరిగితే 9 నెలల్లో శంకర్ నుంచి 3 సినిమాలు వచ్చినట్లే.