
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్.

ఆతర్వాత తెలుగులో రణరంగం సినిమా చేసింది ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ వెంటనే సాయి ధరమ్ తేజ్ కు జోడీగా చిత్ర లహరి సినిమాచేసింది.

చిత్ర లహరి సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ తేజ్ కు వెళ్ళిపోయింది. దాంతో ఈ అమ్మడు తెలుగులో మాయం అయ్యింది.

మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అక్కడ వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. మొన్నయ్య హృదయం అనే సినిమాలో నటించింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే కళ్యాణి. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.