
అందాల ముద్దుగుమ్మ కాజల్ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో మంచి ఫేమ్ సంపాదించుకుంది. పెళ్లై ఓ బాబుకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ సినిమాలకు కాస్త దూరమైంది.

ఇక ఈ మధ్యనే ఈ బ్యూటీ సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గతంలో కంటే కాజల్ కు ఇప్పుడు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ అమ్మడుకు ఆఫర్స్ కరువు అయ్యాయి. దీంతో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది కాజల్ అగర్వాల్.

తెలుగులో మంచు విష్ణు కన్నప్ప సినిమాలో పార్వతి పాత్రలో కనిపించనుంది కాజల్. ఇవే కాకుండా పలు సినిమాల్లో కూడా ఈ నటి కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కుర్రకారు మతిపొగొట్టింది. ఈ నటి సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ క్రమంలోనే ఈఅమ్మడు, సికిందర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ క్లీవేజ్ అందాలతో కనిపించి యూత్ కు చెమటలు పట్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఓ బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ అందం ఏమాత్రం తగ్గలేదంటున్నారు అభిమానులు.