జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైంది దేవర పార్ట్ ఒన్ నుంచి పాట. తారక్ ఇమేజ్‌కి తగ్గట్టు పాట ఎలా ఉండాలని అనుకున్నామో, మేకర్స్ యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి పాటనే విడుదల చేశారంటూ పొంగిపోతున్నారు నందమూరి అభిమానులు.
అనిరుద్ స్వరపరచిన పాట ఇంతకీ ఎలా ఉంది? మీరు వినేశారా?.. ఇంకోసారి వింటారా? వచ్చేయండి.. వినేద్దాం.... దూకే ధైర్యమా జాగ్రత్తా... దేవర ముందు నువ్వెంత అంటూ దేవర సాంగ్ ని రిలీజ్ చేసేశారు మేకర్స్.
భయానికే భయం పుట్టించే... భయం అన్నదే తెలియని దేవర కథను పార్ట్ ఒన్‌లో చెప్పబోతున్నారు మేకర్స్. అనిరుద్ రవిచంద్రన్ స్వరపరచి పాడిన ఈ పాటలోని ప్రతి లైనూ తారక్ కేరక్టరైజేషన్‌ని ఎలివేట్ చేసేదే.
జగతికి చేటుచేయనేలా... దేవర వేటుకందనేలా.. అనే వాక్యాలు ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఆల్రెడీ చూసిన షాట్స్ పాటలో కనిపించినా, కొత్త షాట్స్ కూడా మెప్పిస్తున్నాయి. ఎరుపెక్కిన సంద్రంలో తారక్ కాళ్లు తడిపే షాట్స్ మరీ మాస్‌గా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. అక్టోబర్‌లో ఫుల్ మీల్స్ పెట్టడానికి తారక్ రెడీ అయిపోయారోచ్ అని పండగ చేసుకుంటున్నారు నందమూరి సైన్యం.
కొన్ని షాట్స్ లో తారక్ మాస్‌గా కనిపించినా, కొన్ని యాంగిల్స్ లో మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్‌కి సరైన ప్యాన్ ఇండియా మూవీ పడ్డట్టేనని ఈ ఒక్క పాటతో చెప్పేయొచ్చని అంటున్నారు క్రిటిక్స్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జోష్ ఉన్న సాంగ్ ఇచ్చినందుకు అనిరుద్‌కి థాంక్స్ చెబుతున్నారు తారక్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.