
దేవర సక్సెస్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్,

ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, వరుసగా అదే రేంజ్ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్ 2లో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, తరువాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు.

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్, తరువాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు.

తారక్ మూవీని ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ నీల్, యూరప్‌లోని సీ షోర్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. మేజర్ సీన్స్ అక్కడే షూట్ చేసేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.

పీరియాడిక్ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని చెప్పారు.