వార్ 2 షూటింగ్ మొదలైపోయిందా..? ఈ మధ్యే హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్‌ను కలిసి వెళ్లారు దర్శకుడు అయన్ ముఖర్జీ. ఈ లెక్కన దేవర 2 కంటే ముందే వార్ 2 షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నారా...? కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్, అయన్ లైన్‌లో ఉంటే ఎవరికి తారక్ డేట్స్ ఇవ్వనున్నారు..? అసలు వార్ 2 సెట్స్‌లో జూనియర్ అడుగు పెట్టేదెప్పుడు..?
జూనియర్ ఎన్టీఆర్ మామూలు బిజీగా లేరిప్పుడు. 2001లో కెరీర్ మొదలుపెట్టిన తారక్.. 2018 వరకు ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేస్తూ వచ్చారు. కానీ అరవింద సమేత తర్వాత 2019, 2020, 2021 ఖాళీగా ఉండిపోయాయి.. అలాగే ట్రిపుల్ ఆర్ వచ్చాక.. 2023 మళ్లీ ఖాళీ. 2024లో దేవరతో రానున్నారీయన. అందుకే ఇకపై ఇలాంటి బ్రేక్స్ ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు తారక్.
ఓ వైపు దేవర షూటింగ్ నడుస్తూనే ఉంది.. మరోవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతూనే ఉన్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ 1 షూటింగ్ డిసెంబర్ చివరి నాటికి పూర్తి కానుందని ముందు ప్లాన్ చేసినా.. అది మార్చ్ వరకు కంటిన్యూ అయ్యేలా ఉంది. ఆ తర్వాత దేవర 2 కంటిన్యూ చేస్తారా లేదంటే వార్ 2 వైపు తారక్ వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
వార్ 2 షూటింగ్ ఈ మధ్యే స్పెయిన్‌లో మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌లో హృతిక్ కూడా పాల్గొన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం మార్చ్‌లోనే వార్ 2లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే అయన్ ముఖర్జీ ఇదే విషయంపై తారక్‌ను కలిసి వెళ్లారు. మరోవైపు దేవర 2 షూట్ కూడా 2024 సమ్మర్‌లోపే పూర్తి కానుందని తెలుస్తుంది.
దేవర 2, వార్ 2 పూర్తయ్యాకే.. ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఎప్రిల్ నుంచే తమ సినిమా మొదలవుతుందని ప్రశాంత్ నీల్ చెప్తున్నా.. సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి ఆ తర్వాతే తారక్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. మరి ఒకేసారి ఇన్ని సినిమాలు ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.