Devara: అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సంచలనం

| Edited By: Phani CH

Sep 26, 2024 | 4:56 PM

ఓపెనింగ్ డే రికార్డ్స్‌లో దేవర ప్లేస్ ఎక్కడ..? కల్కిని క్రాస్ చేసేంత సత్తా తారక్ సినిమాకు ఉందా..? 2024 టాప్ ఓపెనర్‌గా దేవర నిలుస్తుందా..? అడ్వాన్స్ బుకింగ్స్ ఏం చెప్తున్నాయి..? హిందీలో దేవర ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి.. ఓవర్సీస్‌లో కలెక్షన్స్ పరిస్థితేంటి..? ఇవన్నీ డీటైలింగ్‌గా ఈ స్టోరీలో చూద్దాం పదండి.. ఇండియాలో కల్కి తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా దేవరనే.

1 / 5
రన్‌ టైమ్‌ లాక్‌ అయింది. సెన్సార్‌ కంప్లీట్‌ అయింది. ప్రమోషన్లు పూర్తయ్యాయి. ఫారిన్‌కి కాపీలు వెళ్లిపోయాయి... ఇక మిగిలింది ఒక్కటే.. స్క్రీన్స్ మీద బొమ్మ పడటం. దానికి కూడా పక్కా ముహూర్తం ఫిక్సయింది.

2 / 5
ఇండియాలో కల్కి తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా దేవరనే. మధ్యలో విజయ్ గోట్ వచ్చినా.. తమిళంతో తప్ప మిగిలిన భాషల్లో ప్రభావం చూపించలేదు. కానీ దేవర అలా కాదు.. సౌత్ టూ నార్త్ ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.

3 / 5
ముఖ్యంగా ఓవర్సీస్‌లో అయితే 2.5 మిలియన్ ఇప్పటికే క్రాస్ అయిపోయింది.. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ 50 కోట్లు గ్రాస్ దాటేసింది. 2024 డే 1 కలెక్షన్స్ లిస్టులో కల్కి ముందుంది. ప్రభాస్ స్టామినా చూపిస్తూ ఈ చిత్రం మొదటి రోజే 191 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

4 / 5
 దీని తర్వాత విజయ్ గోట్ ఉంది. అయితే కల్కి, గోట్ మధ్య దాదాపు 87 కోట్ల గ్యాప్ ఉంది. ఈ రెండు సినిమాలు మినహా.. 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాలేవీ లేవు. ఇప్పుడా ఛాన్స్ దేవర ముందుంది. ట్రేడ్‌లో దేవర దూకుడు చూస్తుంటే 120 నుంచి 150 కోట్ల మధ్యలో ఓపెనింగ్ ఖాయం అనిపిస్తుంది.

5 / 5
తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల షేర్ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. ఓవర్సీస్‌లోనూ సంచలనాలు ఖాయం. అయితే హిందీతో పాటు తమిళంలో వచ్చే కలెక్షన్లను బట్టి దేవర డే 1 స్థానం ఎక్కడో తెలుస్తుంది. అది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.