
ఇక ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్ట్ అనాల్సిన అవసరం లేదు.. మనం భేషుగ్గా డ్రాగన్ అని పిలుచుకోవచ్చని ఫ్యాన్స్ ఒకరితో ఒకరు హ్యాపీగా చెప్పుకుంటున్నారు. దానికి రీజన్‌గా లేటెస్ట్ ప్రదీప్ రంగనాథన్ మూవీని చూపిస్తున్నారు.

తమిళ్‌లో డ్రాగన్ పేరుతో తెరకెక్కిన ఆ సినిమాను తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఎన్టీఆర్ - నీల్ సినిమాకు డ్రాగన్ అనే పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్టే అనేది లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్.

ఈ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లోనే త్వరలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్‌ని ఎన్టీఆర్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ షెడ్యూల్ నుంచి తారక్ జాయిన్ అవుతారు.

పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది డ్రాగన్. మలయాళ హీరో టొవినో థామస్ ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది డ్రాగన్. ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉంటుందని ఆల్రెడీ హింట్ ఇచ్చారు నీల్.

ప్రస్తుతం వార్2 పనుల్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. త్వరలోనే నాటు నాటు తరహా పాటను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు వార్2 మేకర్స్. ఆ షూట్ పూర్తయిన తర్వాత నీల్ సినిమా సెట్స్ కి రానున్నారు ఎన్టీఆర్.