
జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నలు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలతో బిజిగా మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు.

అలాగే స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది ఫరియా అబ్దుల్లా. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి అలరించింది ఫరియా అబ్దుల్లా.

ఇటీవలే రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటోలు షేర్ చేస్తుంది.

ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ యువరాణిలా ఫోటోలకు ఫోజులిచ్చింది. డిజైనర్ డ్రస్ లో చూడచక్కగా మెరిసింది ఫరియా అబ్దుల్లా. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.