
ఏ స్టార్ హీరో సినిమా సందడి చేసినా, అందులో జాన్వీ పేరు వినిపించడమేంటి? ప్రస్తుతం దేవరలో తారక్‌తో కలిసి నటిస్తున్నారు జాన్వీకపూర్. సానా బుచ్చిబాబు డైరక్షన్‌లో రామ్‌చరణ్ పక్కన జాన్వీ నటిస్తున్నారనే విషయాన్ని ఆ మధ్య బోనీకపూర్ ఓపెన్‌గా చెప్పేశారు. 'అరెరే, నాన్న అలా ఎందుకన్నారో నాకు తెలియదు... నేను చేయట్లేదండీ' అని క్లారిటీ ఇచ్చేశారు జాన్వీ.

ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుష్పలో జాన్వీకపూర్ స్పెషల్ సాంగ్ చేస్తున్నారనే టాపిక్ వైరల్ అవుతోంది. అయితే ఈ సాంగ్ కోసం ముందు దీపికను అనుకున్నారట. సడన్‌గా దీపిక ప్రెగ్నెన్సీ న్యూస్‌ని అనౌన్స్ చేశారు. సో ఛాన్సు జాన్వీకి వెళ్లిందట. ఇంతకీ జాన్వీ ఈ ప్రాజెక్టుకైనా ఓకే చెబుతారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, బెంగుళూరులో ప్రశాంత్‌నీల్ ఫ్యామిలీని కలిశారు తారక్ దంపతులు. ప్రశాంత్‌నీల్ దంపతులతో పాటు, రిషబ్‌శెట్టి దంపతులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్లందరూ ఉన్న పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటించే సినిమాలో రిషబ్ ఏదైనా రోల్ చేస్తున్నారా? ఆ రోల్ పాజిటివా? నెగటివా? అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. తారక్ - రిషబ్ కొలాబరేషన్ నిజమైతే బావుంటుందని అంటున్నారు కన్నడిగులు.

ఆమె హీరోయిన్‌గా ఓదెల 2 మొదలైంది. ఓదెల రైల్వేస్టేషన్‌కి కొనసాగింపుగా తెరకెక్కుతోంది ఈ సినిమా. సంపత్‌నందితో కెరీర్ బిగినింగ్ నుంచే మంచి అసోసియేషన్ ఉంది తమన్నాకు. ఇప్పుడు ఓదెల2ని కూడా సంపత్ నంది టీమ్ వర్క్స్ నిర్మిస్తోంది. ఫస్ట్ షాట్‌కి సంపత్‌నంది క్లాప్ కొట్టారు.

ఇక్కడ ముహూర్తం ముగించుకోగానే వారణాసిలో ల్యాండ్ అయ్యారు తమన్నా. అక్కడ శివయ్యకు అభిషేకం చేసి, రానున్నదంతా మంచి కాలం కావాలని మొక్కుకున్నారు. హరోం హర అంటూ తమన్నా పంచుకున్న ఫొటోలకు ఫిదా అవుతున్నారు జనాలు. మహా శివరాత్రి సందర్భంగా, కాస్త ముందుగానే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నట్టు చెప్పారు తమన్నా.