జాన్వీ సౌత్ ఎంట్రీ గురించి చాలా కాలంగా డిస్కషన్ జరుగుతోంది. బిగ్ బ్యాంగ్‌తో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఆల్రెడీ టాప్ చైర్‌లో ఉన్న బ్యూటీస్‌కు కూడా షాక్ ఇస్తున్నారు. భారీ హైప్ ఉన్న సౌత్ డెబ్యూ కోసం డీ గ్లామ్‌లో లుక్‌లో కనిపించబోతున్నారట జూనియర్ శ్రీదేవి.
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తారన్న ప్రచారం ఎప్పుడో మొదలైంది. ఎన్టీఆర్ శ్రీదేవి సక్సెస్‌ఫుల్ కాంబో కావటంతో... జూనియర్‌తో జాన్వీ జోడి కడితే.. సౌత్‌లో ఆమెకు గ్రాండ్ వెల్‌కం దక్కుతుందని భావించారు. ఆ అంచనాలతోనే జాన్వీని ఏరి కోరి హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు.
ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ఇమేజ్‌తో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ, ఆన్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. అయితే బీటౌన్‌లో హోమ్లీగా కనిపిస్తున్నా ఇంత వరకు డీగ్లామ్ రోల్ మాత్రం చేయలేదు. టాలీవుడ్ డెబ్యూలో మాత్రం ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారు.
దేవర సినిమా విలేజ్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్న జాన్వీ ఫస్ట్ టైమ్ డీ గ్లామ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ షూటింగ్‌లో యాక్షన్ సీన్‌లోనూ నటించారు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను దేవర కోసం ప్లే చేస్తున్నారు ఈ బ్యూటీ.
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కాంబో కావటం, ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తుండటం, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ ప్లే చేస్తుడటంతో దేవర మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు జాన్వీ యాక్షన్ సీన్ కూడా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆ హైప్ నెక్ట్స్ లెవల్‌కు చేరింది.