Film Updates: చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైజయంతి మూవీస్ వార్నింగ్.. థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్‌ నోటీసులు..

| Edited By: Prudvi Battula

Oct 13, 2023 | 3:11 PM

1990లో రిలీజ్ అయిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. నిన్న మొన్నటి వరకు ఇండియన్2 డబ్బింగ్ వర్క్‌లో బిజీగా ఉన్న శంకర్‌, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లియో ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్‌ నోటీసులు ఇచ్చింది.  బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. టైగర్‌ 3 సినిమా నుంచి కత్రినా కైఫ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. 

1 / 5
1990లో రిలీజ్ అయిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. ఇటీవల ఈ సినిమా లైన్స్‌లో మరో మూవీ తెరకెక్కుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పందించింది. సినిమాకు సంబంధించిన పూర్తి హక్కులు తమ దగ్గరే ఉన్నాయని, ఎవరైనా ఆ కాన్పెప్ట్‌ను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

2 / 5
నిన్న మొన్నటి వరకు ఇండియన్2 డబ్బింగ్ వర్క్‌లో బిజీగా ఉన్న శంకర్‌, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్‌ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు.

3 / 5
లియో ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్‌ నోటీసులు ఇచ్చింది. అభ్యంతరకర పదాలతో ఉన్న ట్రైలర్‌ను ప్రదర్శించినందుకు ఈ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ట్రైలర్‌ విషయంలో వస్తున్న విమర్శలపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. కథ పరంగానే అలాంటి డైలాగ్‌ వాడాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చారు.

4 / 5
బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. సితారే జమీన్ పర్‌ పేరుతో ఓ ఎమోషనల్‌ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టుగా వెల్లడించారు. గతంలో తారే జమీన్‌ పర్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమిర్‌ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.

5 / 5
టైగర్‌ 3 సినిమా నుంచి కత్రినా కైఫ్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో తొలి ఫీమేల్ స్పై అంటూ కత్రినా యాక్షన్ లుక్‌ను రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్‌ 3 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో షారూఖ్‌ ఖాన్‌ కూడా గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నారు.