
శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అనగనగా ఒక రాజు సినిమాతో తెలుగు వెండితెర పైకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఐరన్ లెగ్ అంటూ అనేక వార్తలు వచ్చాయి.

కానీ గబ్బర్ సింగ్ మూవీ ఈ చిన్నదాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ మూవీలో నటించి మొదటి సారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత వరసగా హిట్స్ అందుకుంటూ.. లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.

అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొన్ని రోజుల పాటు తన హవా కొనసాగించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని, తన నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా, ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేది. ముఖ్యంగా ఈ బ్యూటీ లవ్ ట్రాక్స్ చాలానే ఉన్నాయని చెప్పాలి.

చివరగా 2021లో శంతను హజారికాతో డేటింగ్ చేస్తున్నట్లు తానే స్వయంగా చెప్పింది. దీంతో వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. కానీ చివరకు వారు బ్రేకప్ చెప్పుకొని వారి వారి కెరీర్ పై ఫోకస్ పెట్టారు.

ఇక దీని తర్వాత శృతి హాసన్ ఎప్పుడూ ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడలేదు. అయితే ఆమె బర్త్ డే సందర్భంగా శృతి హాసన్ గతంలో పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను గతంలో తనకు పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకం లేదు అని వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటాను, వివాహం చేసుకోవడం భయం, ఒంటరిగా ఉండటమే చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనేమో అంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.