
సలార్ రీమేకా? ఫ్రీమేకా? సలార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచీ జరుగుతున్న డిస్కషన్ అది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన సలార్ సంగతి ఎలా ఉన్నా, డంకీ సంగతి మాత్రం ఫ్రెష్ గా నెట్టింట్లో సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన షారుఖ్... నెక్ట్స్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నది ఫ్రీమేక్ సినిమానేనా? కమాన్ ఆ సంగతులన్నీ చూసేద్దాం.

ప్రశాంత్ నీల్ అనగానే అందరికీ కేజీయఫ్ రెండు చాప్టర్లూ గుర్తుకొస్తాయి. కానీ కన్నడిగులు మాత్రం ఉగ్రం సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇంటెన్స్ యాక్షన్ స్టోరీగా యూత్‌ని ఆకట్టుకుంది ఉగ్రమ్. ఈ సినిమా స్టోరీతోనే సలార్ తీస్తున్నారన్నది ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న విషయం.

సలార్ ప్రస్తుతం ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. గ్రాఫిక్స్ పనులన్నీ పూర్తి చేసుకుని డిసెంబర్ 22న విడుదలకు రెడీ అవుతోంది. బిగ్గర్ స్కేల్‌లో తెరకెక్కిన సలార్, నిజంగా రీమేకా? లేకుంటే ఫ్రెష్ స్టోరీనా అనేది ఇంకో రెండు నెలల్లో క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది.

సలార్ సంగతి తెలిసిన మరుక్షణమే మరో సినిమా గురించి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ మూవీ పేరు డంకీ. షారుఖ్ హీరోగా నటిస్తున్న సినిమా డంకీ. ఒకే ఏడాదిలో మూడో హిట్ కొట్టి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు షారుఖ్. రాజ్‌కుమార్ హిరానీ డైరక్షన్‌లో డంకీ చేస్తున్నారు. డంకీ ఫ్యామిలీ ఆడియన్స్ ని తప్పక మెప్పిస్తుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది బాద్షాలో.

మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న కామ్రేడ్ ఇన్ అమెరికా సినిమాకు ఫ్రీమేక్‌గా డంకీని తెరకెక్కిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దుల్కర్ సల్మాన్ నటించిన కామ్రేడ్ ఇన్ అమెరికా సినిమాలోని మెయిన్ థీమ్‌ను తీసుకుని డంకీని రూపొందిస్తున్నారని టాక్. దుల్కర్ మూవీకి, షారుఖ్ సినిమాకీ ఎంత మేర కనెక్షన్ ఉందనే విషయం కూడా డిసెంబర్ 22న తెలిసిపోతుంది.