2 / 5
ఈ మధ్య ఇతిహాసాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా దేవుడిపై కథలు చాలా రాసుకుంటున్నారు దర్శకులు. మొన్నామధ్య వచ్చిన అఖండలో శివతాండవం కనిపించింది. కార్తికేయ 2తో శ్రీ కృష్ణుడు ఈ భూమ్మీద నడిచిన వాడే అంటూ ఆనవాళ్లు చూపించారు.. అక్షయ్ సైతం రామ్ సేతుతో నాటి సంగతులే చెప్పారు.. ఇప్పుడు హనుమాన్ ఏకంగా 250 కోట్లు వసూలు చేసింది.