War 2: యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిన తారక్.. బాలీవుడ్ క బాద్‍షా అవనున్న ఎన్టీఆర్
ఈ ఇయర్ తారక్ బర్త్‌డేను బాలీవుడ్ కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తోంది. మోస్ట్ అవెయిటెడ్ వార్ 2 టీజర్ ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. హృతిక్ వర్సెస్ తారక్ అన్నట్టుగా కట్ చేసిన టీజర్‌తో జూనియర్ ఫ్యాన్స్ హ్యాపీనా... తారక్ బాలీవుడ్ ఎంట్రీకి వార్ 2తో రెడ్ కార్పెట్ పడినట్టేనా..? ట్రిపులార్, దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2.
Updated on: May 22, 2025 | 4:57 PM

ట్రిపులార్, దేవర లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వార్ 2. మంగళవారం తారక్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసింది యూనిట్.

ఈ టీజర్‌తో సినిమా కథ, హీరోల క్యారెక్టర్స్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వార్ 1లో కబీర్‌ను వేటాడే సిన్సియర్ ఆఫీసర్‌గా టైగర్ ష్రాఫ్ నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో తారక్ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నారు.

అయితే టైగర్ కన్నా తారక్‌ను మోర్ పవర్‌ఫుల్ అన్నట్టుగా ప్రజెంట్ చేసింది మూవీ టీమ్. తారక్ బర్త్ డే టీజర్ కావటంతో ఎన్టీఆర్ వాయిస్‌తోనే టీజర్‌ను కట్ చేశారు.

విజువల్‌గా మాత్రం ఇద్దరు హీరోలకు ఈక్వల్ స్పేస్ ఇచ్చారు. సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందన్న విషయాన్ని టీజర్‌తోనే కన్ఫార్మ్ చేసింది వార్ 2 టీమ్. ముఖ్యంగా ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలెట్‌గా ఉంటాయన్న బజ్ టీజర్‌తోనే క్రియేట్ అయ్యింది.

ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ టైమ్స్‌లో ఇంత భారీ చిత్రం ఇంత కరెక్ట్‌గా చెప్పిన డేట్‌కు రిలీజ్ కావటం కూడా ఓ రికార్డే అంటున్నారు జూనియర్ ఫ్యాన్స్.




