
కేలండర్ ఇయర్ మారే ప్రతిసారీ, మనం సాధించిందేంటి? అని చెక్ చేసుకోవడం చాలా మందికి అలవాటు. అలా చూసుకున్నప్పుడు సక్సెస్‌ఫుల్ ఇయర్ అనిపిస్తే ఆ సంతోషమే వేరు. 2023అలాంటి సంతోషాలను కొందరు హీరోయిన్లకు మళ్లీ మళ్లీ ఎక్స్ పీరియన్స్ చేశారు. ఇంతకీ ఎవరు వారు? వాళ్లకు అంత సంతోషాన్నిచ్చిన సినిమాలేంటి?

నేషనల్ క్రష్, 2023ని భీభత్సంగా ఇష్టపడుతున్నారంటే నమ్మేయాల్సిందే. తనకు చిన్నప్పటి నుంచీ క్రష్ ఉన్న విజయ్‌తో వారసుడు సినిమాలో నటించేశారు. అలాగే బాలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టాలన్న చిరకాల కల నెరవేరింది కూడా ఈ ఏడాదే. సో బ్యాక్ టు బ్యాక్ రెండు కోరికలు తీయడంతో మోస్ట్ హ్యాపియస్ట్ పర్సన్‌గా సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు రష్మిక మందన్న.

రష్మికకు రెండు హిట్లు పడ్డట్టే కీర్తీకి కూడా ఈ ఏడాది రెండు హిట్లున్నాయి. పక్కా తెలంగాణ అమ్మాయిగా దసరాలో ధూమ్‌ధామ్ చేశారు. ఇప్పటికీ ఓ వదినె అంటూ కీర్తీసురేష్ దసరాను గుర్తుచేసుకుంటున్నారు జనాలు. అలాగే తమిళ్‌లో ఉదయనిధి స్టాలిన్‌తో చేసిన మామన్నన్ కూడా సూపర్‌డూపర్ హిట్ అయింది. తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది మామన్నన్.

సలార్ సక్సెస్ తరువాత ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో పాటు ఇండస్ట్రీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న మరో పేరు శ్రుతి హాసన్. హీరోలు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రుతి హీరోయిన్‌గా ఒక్క సినిమా చేస్తే చాలు ఫేట్ మారిపోతుందని మరోసారి ప్రూవ్ అయ్యిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

నయనతారకీ, దీపిక పదుకోన్‌కి కూడా మల్టిపుల్ సక్సెస్‌లున్నాయి. రీసెంట్ గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్ సర్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. మాస్టారూ మాస్టారూ అంటూ సర్‌ని గుర్తుచేసుకున్నా, అందులో అందంగా కనిపిస్తున్నది సంయుక్తమీననే. ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే సంయుక్తకి విరూపాక్ష ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఈ నెల 29న విడుదలయ్యే డెవిల్‌తో ఆమె హ్యాట్రిక్ ని టచ్ చేస్తారా? లేదా అనేది తెలుస్తుంది.