
అమ్మ సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. హాయ్ నాన్న నాన్న సెంటిమెంట్‌తో వస్తున్న సినిమా అని అన్నారు నాని. తండ్రీ కుమార్తెల మధ్య అనుబంధం ప్రధానంగా తెరకెక్కిందని అన్నారు. మెసేజ్ ఇచ్చే మూవీ కాదని, మంచి ఫీల్‌గుడ్ మూవీ అని చెప్పారు నాని.

యానిమల్‌లో బాబీ దేవోల్ లుక్ గురించి ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విలన్ లుక్ కోసం ఆయన నాలుగు నెలల పాటు స్వీట్స్ తినలేదట. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి, ఆ ఫిజిక్ తెచ్చుకున్నారట. బాబీ లుక్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతారని అంటున్నారు మేకర్స్.

తాను సింగిల్ పేరెంట్‌ని కాదని అన్నారు నటి ఇలియానా. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు ఈ గోవా బ్యూటీ. తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో తన తల్లి తనను కంటికి రెప్పలా చూసుకున్నారని అన్నారు.

ఇల్లు తనకు దేవాలయమని అంటున్నారు అదా శర్మ. తాను ఎక్కడుంటున్నాను, ఎవరితో ఉంటున్నాననే విషయాలు వ్యక్తిగతమైనవని చెప్పారు. తప్పుడు ప్రచారాలను పట్టించుకోనని తెలిపారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని అదాశర్మ కొన్నట్టు వచ్చిన వార్తలకు ఆమె స్పందించారు.

విక్రాంత్ మస్సే హీరోగా నటించిన చిత్రం ట్వల్త్ ఫెయిల్. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేందుకు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసింది. ఈ విషయాన్ని విక్రమ్ తెలిపారు. ట్వల్త్ ఫెయిల్ అయిన ఓ యువకుడు పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీయస్ అధికారి ఎలా అయ్యాడన్నది ఈ సినిమా కథ.