ఫ్లాపులతో ఎంట్రీ ఇచ్చి.. టాప్ ప్లేస్‌పై కన్నేసిన హీరోయిన్లు

Edited By: Phani CH

Updated on: Mar 07, 2025 | 6:22 PM

ఫ్లాప్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా టాప్ ప్లేస్‌పై కన్నేసారు ముగ్గురు హీరోయిన్లు. డిజాస్టర్ మూవీస్‌తో డెబ్యూ చేసినా.. రెడ్ కార్పెట్ వేసి మరీ వాళ్ళను ఆహ్వానిస్తున్నారు మన దర్శకులు. టాలీవుడ్‌లోనే కాదు.. మొత్తం సౌత్‌లోనే సెన్సేషన్ అవుతున్నారు ఆ ముగ్గురు బ్యూటీస్. మరి అంతగా సంచలనాలు రేపుతున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దామా..?

1 / 5
కయాడు లోహర్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భామే కనిపిస్తుందిప్పుడు. డ్రాగన్ సినిమాతో ఈ బ్యూటీ జాతకమే మారిపోయింది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’లో నటిస్తున్నారు ఈ బ్యూటీ.

2 / 5
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే.. 2022లోనే శ్రీవిష్ణు ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కయాడు. అల్లూరి ఫ్లాపవ్వడంతో కయాడు లోహర్ గురించి పెద్దగా చర్చ జరగలేదు.

3 / 5

కానీ డ్రాగన్ బ్లాక్‌బస్టర్ కావడంతో.. ఈ భామ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు నుంచి వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి కయాడుకు.

4 / 5
భాగ్యశ్రీ బోర్సే  సైతం డిజాస్టర్‌తో ఎంట్రీ ఇచ్చి.. దుమ్ము దులుపుతున్నారిప్పుడు. మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా.. చేతిలో 5 భారీ ఇండియన్ సినిమాలున్నాయి ఈ భామకు. విజయ్ దేవరొకండ కింగ్ డమ్.. దుల్కర్ సల్మాన్ కాంత.. సూర్య వెంకీ అట్లూరి సినిమా.. రామ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారు భాగ్యశ్రీ.

5 / 5
ఇక మీనాక్షి చౌదరి సైతం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే ఫ్లాప్ సినిమాతోనే పరిచయమైంది. కానీ లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాంతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ. మొత్తానికి ఫ్లాప్‌తో ఎంట్రీ ఇచ్చి టాప్ ప్లేస్‌పై కన్నేస్తున్నారు ఈ బ్యూటీస్.