.సౌత్ సినిమా బాలీవుడ్‌ను రూల్ చేస్తోంది. మన హీరోలు కూడా నార్త్ మార్కెట్‌ను శాసించే స్టేజ్‌కు వచ్చేశారు. కానీ హీరోయిన్ పరిస్థితి మాత్రం అలా లేదు. సౌత్‌లో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్న బ్యూటీస్ కూడా నార్త్‌లో బిజీ కాలేకపోతున్నారు.
జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సినిమా రిలీజ్‌కు ముందు నయన్ పేరు నార్త్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. సక్సెస్ క్రెడిట్ అంతా షారూఖ్ ఖాతాలోకి వెళ్లిపోవటంతో నయన్‌ను పట్టించుకునే వారే కరువయ్యారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు చూస్తున్న సమంత పరిస్థితి కూడా అలాగే ఉంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో నార్త్ ఆడియన్స్‌ను పలకరించిన సామ్‌కి డిజిటల్‌లో మంచి రెస్పాన్స్ వచ్చినా... సినిమాల విషయంలో అంత బజ్ రావటం లేదు. ప్రజెంట్ సిటాడెల్ రీమేక్‌లో నటిస్తున్న సామ్‌ను బాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకోవాలన్న ఆశలు ఊరిస్తూనే ఉన్నాయి.
సౌత్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న పూజ హెగ్డే కూడా బాలీవుడ్‌లో తడబడుతున్నారు. బాలీవుడ్ మూవీతోనే పరిచయం అయిన పూజా ఆ తరువాత సౌత్ బాట పట్టి సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఇప్పటికీ బాలీవుడ్ హిట్, ఈ బుట్టబొమ్మకు అందని దాక్షగానే ఉంది.
సౌత్ నుంచి బాలీవుడ్ ట్రయల్స్‌లో ఉన్న రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నార్త్‌లో అవకాశాలు వస్తున్నా... స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే బ్రేక్ మాత్రం రావటం లేదు. దీంతో సౌత్ బ్యూటీస్‌కి బాలీవుడ్ అంతగా కలిసిరావటం లేదంటున్నారు క్రిటిక్స్.