లాస్ట్ టైమ్ మీ హీరోకి వచ్చింది.. ఈ సారి మీకు నేషనల్ అవార్డు వస్తుందా? అనే ప్రశ్న ఎదురైనప్పుడు వస్తుందనుకుంటున్నా అంటూ ఆన్సర్ ఇచ్చారు నేషనల్ క్రష్. ఒకవేళ అదే జరిగితే ఈ సారి పోటీలో ఉన్న మిగిలిన నాయికలు ఎవరనే డిస్కషన్ షురూ అయింది.
వారికి దొరికిన ఫస్ట్ నేమ్ కల్కిలో దీపిక పదుకోన్. 2024 పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో దీపికా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కథ మొత్తం ఈమె చుట్టూనే తిరిగింది.
ఈ మధ్య కాలంలో జనాలందరూ మాట్లాడుకున్నది అమరన్‌లో సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ గురించే. కొన్ని కొన్ని సీన్స్ లో ఏడిపించేశారంటూ ప్రశంసలు కురిపించారు. ఇందులో ఈమె నటన పీక్స్ అనే చెప్పాలి.
అలాగే లక్కీ భాస్కర్‌లో మీనాక్షి చౌదరి యాక్టింగ్‌కీ మంచి మార్కులే పడుతున్నాయి. 2024కిగానూ... వీరిలో ఎవరైనా నేషనల్ అవార్డు అందుకుంటారా? లేకుంటే సరికొత్త పేరు ఏమైనా వినిపిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఉలజ్‌తో జాన్వీ కపూర్ కూడా ది బెస్ట్ అనిపించుకున్నారు. అంతే కాదు.. ఈ మధ్య జిగ్రాలో నటించారు ఆలియా భట్. ఆమె పెర్ఫార్మెన్స్ కి కూడా ఫిదా అవుతోంది నార్త్ సర్కిల్. మరోసారి జాతీయ పురస్కారానికి పోటీ పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదన్నది న్యూస్.