- Telugu News Photo Gallery Cinema photos Heroines who acted in Balakrishna movies enticing users on instagram but are unable to get success on Silverscreen
సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న బాలయ్య హీరోయిన్స్.. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం కలసి రావటం లేదు…
ప్రజెంట సిల్వర్ స్క్రీన్ మీద స్పేస్ కోల్పోయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. డిజిటల్‌లో చేస్తున్న గ్లామర్ షో వెండితెర భవిష్యత్తుకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. తాజాగా బాలయ్యకు ఈ లిస్ట్‌లో బాలయ్యకు జోడిగా నటించిన అందాల భామలు కాస్త ఎక్కువగా..
Phani CH |
Updated on: May 03, 2023 | 3:26 PM

ప్రజెంట సిల్వర్ స్క్రీన్ మీద స్పేస్ కోల్పోయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. డిజిటల్‌లో చేస్తున్న గ్లామర్ షో వెండితెర భవిష్యత్తుకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. తాజాగా బాలయ్యకు ఈ లిస్ట్‌లో బాలయ్యకు జోడిగా నటించిన అందాల భామలు కాస్త ఎక్కువగా ఫ్లాష్ అవుతున్నారు,

తెర మీద సీతాదేవి పాత్రలో హుందగా సౌత్ ఆడియన్స్ దృష్టిలో పడిన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత గ్లామర్ హీరోయిన్ అనిపించుకునేందుకు గట్టిగానే కష్టపడ్డారు. కానీ ఆ ఇమేజ్ మాత్రం ఇప్పటికీ అమ్మడిని ఊరిస్తూనే ఉంది. వరుసగా అవకాశాలు వస్తున్నా.. ఈ బ్యూటీని స్టార్ లీగ్‌లో నిలబెట్టే కమర్షియల్ రోల్ ఇంత వరకు పడలేదు.

తెర మీద మిస్ అయిన గ్లామర్ ఇమేజ్‌ను సోషల్ మీడియా ద్వారా సాధించేందుకు కష్డపడుతున్నారు ప్రగ్యా. సినిమాలో చీరకట్టులో కనిపించే ఈ భామ. సోషల్ మీడియాలో మాత్రం సింగిల్ పీస్ బికినీలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో అమ్మడి ఆన్‌లైన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది.

సౌత్‌లో ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనూ కనిపించిన బ్యూటీ సోనాల్ చౌహాన్. తెర మీద కూడా గ్లామర్ షో ఇరగదీసే ఈ భామ... అవకాశాల వేటలో మాత్రం వెనకబడిపోయారు. ఒకటి రెండు సార్లు బాలయ్య ఛాన్స్ ఇవ్వటమే తప్ప సౌత్‌లో స్టార్ హీరోలెవరూ ఈ బ్యూటీని కన్సిడర్ చేయలేదు. దీంతో సోనాల్ కూడా సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారు.

నటిగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ఇమేజ్ ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీస్. అందుకే ఆన్‌లైన్‌లో గ్లామరస్ ఫోటోషూట్స్‌తో హీట్ పెంచుతున్నారు.





























