
మన దగ్గర చేసింది కొన్ని సినిమాలే అయినా, ఒక్క పాటతోనో, ఒకే ఒక్క సినిమాతోనో గుర్తుండిపోయిన నాయికలు చాలా మందే ఉంటారు.

అలా పేరు చెప్పగానే చటుక్కున గుర్తొచ్చే నిన్నటి తరం నాయికల్లో ఊర్మిళ ఉంటారు. యాయిరే యాయిరే అంటూ ఇప్పటికే ఊర్మిళను హ్యాపీగా అనుకుంటుంటారు మన వారు..

ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్ లోనే సెటిల్ అయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌కీ, టీవీ షోలకీ పరిమితమయ్యారు.

అయితే త్వరలోనే ఊర్మిళ రిటర్న్స్ అనే మాట వినిపిస్తోంది. ఉన్నట్టుండి సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించినట్టు.? భర్త మోసిన్ అక్తర్ నుంచి విడాకులు తీసుకుంటున్నారట ఊర్మిళ.

విడిపోవడం ఆయనకు ఇష్టం లేకపోయినా, కలిసి ఉండటం తనకు ఇష్టం లేదని ఊర్మిళ విడాకులకు అప్లై చేశారట. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ముంబై టాక్.

తెలుగులో అంతం, గాయం, అనగనగా ఒక రోజు లాంటి సినిమాల్లో మెరిసిన ఊర్మిళకు... వర్మ రంగీలా విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. శంకర్ భారతీయుడులో అదిరేటి డ్రస్ సాంగ్ ఎవర్‌గ్రీన్.

ఇప్పటికీ ఊర్మిళ అనగానే మనవారికి వర్మ హీరోయిన్‌గానే గుర్తుంటారు. మరి రీ ఎంట్రీలోనూ వర్మతో కలిసే తెలుగువారిని పలకరిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.