Trisha: గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా ??
త్రిష గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్‌లో హాట్ డిస్కషన్. చెన్నై సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటి నుంచీ ఏదో ఒక గుడ్‌న్యూస్ చెబుతూనే ఉన్నారు కదా... మరి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం ఉంది? అని అనుకుంటున్నారా? అయితే ఓ హింట్... ఈ న్యూస్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించింది కాదు... పక్కా పర్సనల్... ఏంటీ.. మీకు అర్థమవుతోందా? త్రిష త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. వరుడి గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు.