
4 నెలల్లో అరడజన్ సినిమాలు.. ఏ పోస్టర్‌పై చూసినా ఆమె బొమ్మే.. ఏ హీరోతో చూసినా ఆమె డాన్సులే.. కానీ ఇవన్నీ ఒక్కసారిగా మాయం అయిపోయాయి. సంక్రాంతి తర్వాత కనిపించడమే మానేసింది ఆ బ్యూటీ.

ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయుంటుందిగా.! ఆ మీరనుకున్నదే.. శ్రీలీల గురించే ఆ ఇంట్రో అంతా. అసలిప్పుడు ఆమె ఏం చేస్తున్నారు..? రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన హీరోయిన్లకు మామూలుగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

శ్రీలీల కూడా అదే బ్యాచ్. పెళ్లి సందడిలో నటించిన తర్వాత.. ఏడాది వరకు మరో సినిమా ఏదీ రాకపోతే అమ్మడు సింగిల్ సినిమా వండరేమో అనుకున్నారంతా. కానీ ధమాకాతో దుమ్ము దులిపేసారు శ్రీలీల.

అందులో డాన్సులు కుమ్మేసారీ బ్యూటీ. ధమాకా తర్వాత శ్రీలీలకు తిరుగులేకుండా పోయింది. నిజానికి పెళ్లి సందడి విడుదలైన 14 నెలల తర్వాత ధమాకా వచ్చింది. కానీ ఆ తర్వాత అస్సలు గ్యాప్ ఇవ్వలేదు ఈ బ్యూటీ.

వెంటవెంటనే స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలు చేసారు శ్రీలీల. ఇందులో భగవంత్ కేసరిలో నటనతోనూ మెప్పించారు శ్రీలీల.

చేతిలో ఉస్తాద్, V12 సినిమాలున్నా.. అవి మొదలయ్యే వరకు ఖాళీనే. ఎలాగూ సినిమాల్లేవు కాబట్టి చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఈమె యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.

అందుకే మంచి ఆఫర్స్ వచ్చేవరకు వేచి చూద్దామని ఫిక్సైపోయారు శ్రీలీల. అందుకే ఈ మధ్య కొన్ని ఆఫర్స్ రిజెక్ట్ చేసారు ఈ బ్యూటీ. మొత్తానికి శ్రీలీలకు మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో చూడాలి.