సలార్ సక్సెస్ తరువాత ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో పాటు ఇండస్ట్రీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న మరో పేరు శ్రుతి హాసన్. హీరోలు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రుతి హీరోయిన్‌గా ఒక్క సినిమా చేస్తే చాలు ఫేట్ మారిపోతుందని మరోసారి ప్రూవ్ అయ్యిందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న పవన్ కల్యాణ్ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా గబ్బర్ సింగ్. రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేశారు పవన్ కల్యాణ్. ఇప్పటికే పవన్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్‌లో గబ్బర్ సింగ్‌ది స్పెషల్ ప్లేస్.
గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో వెంటనే మెగా కాపౌండ్ నుంచి శ్రుతికి మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమాలో హీరోయిన్‌గా నటించారు శ్రుతి. జంజీరా లాంటి భారీ డిజాస్టర్ తరువాత వచ్చిన ఎవడు, చరణ్ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలోనూ శ్రుతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇద్దరమ్మాయిలతో ఫెయిల్యూర్ తరువాత.. శ్రుతితో కలిసి నటించిన రేసుగుర్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బన్నీ.
గబ్బర్ సింగ్ సెంటిమెంట్‌ను గట్టిగా నమ్మిన పవర్ స్టార్.. రీ ఎంట్రీ విషయంలోనూ శ్రుతి హెల్ప్ తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన వకీల్ సాబ్‌లో పవన్‌కు జోడిగా కనిపించారు శ్రుతి. ఒరిజినల్ వర్షన్‌లో హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయినా... రీమేక్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి మరీ శ్రుతికి ఛాన్స్ ఇచ్చారు.
రీఎంట్రీ తరువాత కూడా గోల్డెన్ లెగ్ ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు శ్రుతి. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రుతి, ఆ సినిమాతో రవితేజ ఫెయిల్యూర్స్‌కు బ్రేకేశారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత డైలమాలో పడ్డ చిరు కూడా శ్రుతి హెల్ప్‌తో వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ అందుకున్నారు.