Rashmika Mandanna: పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక కొత్త ప్రయోగం.! కామెడీ , హారర్..
ఒక్కసారి ఫేమ్ వచ్చాక, అటూ ఇటూ చూడాల్సిన అవసరం ఏముంటుంది.? వచ్చిన ఫేమ్‌ని చక్కగా కాపాడుకుంటే సరిపోతుంది. అదే ఇంకో పది మెట్లు ఎక్కించేస్తుంది. అంతే కదా అని అంటున్నారు రష్మిక మందన్న. అలాగని అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు ఈ బ్యూటీ.. తనలో ఉన్న పొటెన్షియల్‌ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో చూపించాలనుకుంటున్నారు. విషయం ఏదైనా సరే, కూర్చుని తీరిగ్గా ఆలోచించే సమయం లేదు మిత్రమా అని అంటున్నారు రష్మిక మందన్న.