
యానిమల్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, హైప్ చూసిన తర్వాత అందరికీ స్పిరిట్ మీద హోప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్ ఇన్నాళ్ల కెరీర్‌లో చేసిన కేరక్టర్ వేరు... ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా పెరామీటర్స్ లో కనిపించడం వేరు అని మాట్లాడుకుంటున్నారు.

వీటన్నిటికీ తోడు సందీప్ రెడ్డి వంగాకు ఇటీవల రష్మిక ఇచ్చిన హైప్ మామూలుది కాదు... అదేంటంటారా? చూసేద్దాం రండి.. యానిమల్ సినిమా సక్సెస్ పార్టీ కూడా కంప్లీట్ అయ్యాక , నార్త్ వాళ్లతో మాట్లడారు రష్మిక మందన్న.

ఈ సినిమా మేకింగ్ గురించి ఆమె చెప్పిన మాటలు అందరికీ గూస్‌బంప్స్ తెప్పించాయి. యానిమల్‌తో నటిగా ఆమె ఎంత ఎలివేట్ అయ్యారో చెబుతూనే కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా గురించి కూడా అద్భుతమైన హింట్స్ ఇచ్చారు.

యానిమల్ సీక్వెల్.. యానిమల్ పార్క్ మామూలుగా ఉండదన్నది జనాలకు రష్మిక ఇస్తున్న హింట్. యానిమల్ పార్కుకు సంబంధించి ఇప్పటికే సందీప్ రెడ్డి ఆమెతో చాలా విషయాలను షేర్ చేసుకున్నారట.

అవన్నీ ఇప్పుడు ఇంకా ప్రైమరీ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఆ ఐడియాలు విన్నప్పుడు అతన్ని విస్తుపోయి చూశారట రష్మిక మందన్న. యానిమల్ సినిమా ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్‌లో ఆ మిగిలిన వందా చేస్తుందని కొందరు, చేయకపోయినా నష్టమేం లేదు..

టీమ్ అంతా కలిసి 500 కోట్లు వస్తుందనుకున్న ప్రాజెక్ట్ కి 900 కోట్లు రావడం మామూలు విషయం కాదని మరికొందరు అంటున్నారు. జనాలందరూ యానిమల్ గురించి మాట్లాడుకుంటుంటే, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మీద ఫోకస్ చేస్తున్నారు.

ఖాకీ అవతార్‌లో, సందీప్‌రెడ్డి వంగా డిజైన్ చేసిన కేరక్టర్‌లో స్పిరిట్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. ఆయన ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు, ఇప్పుడు స్పిరిట్ వేరు అన్నట్టు డిజైన్ చేస్తున్నారు సందీప్.

2024 ఎండింగ్‌లో స్పిరిట్‌ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది సందీప్ ప్లాన్. ఆల్రెడీ యానిమల్‌తో వెయ్యి కోట్లకు చేరువైన సందీప్, స్పిరిట్‌తో ఆ ఫిగర్‌ని బాక్సాఫీస్ దగ్గర డబుల్ చేయాలన్న ఎయిమ్‌తో పనిచేస్తున్నారంటున్నారు యూనిట్ మెంబర్స్.