
నందితా శ్వేత..వెండితెరపై అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి.

అంతేకాకుండా.. నందితా శ్వేత నటన పరంగానూ సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే అన్ని చిత్రాలు కలిసోచ్చినా కానీ.. నందితా శ్వేతకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అలరిస్తుంది. తాజాగా నందితా శ్వేత తన ఇన్స్టాలో లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది.

అయితే ఈ ఫోటలకు ఓ నెటిజన్ అసభ్యకరంగా కామెంట్ చేశాడు.నీ శరీరాకృతిని చూసుకో.. నీ షేప్స్ కూడా చూసుకో.. కాస్త వర్కవుట్స్ చేయ్ అంటూ అసభ్యంగా కామెంట్స్ చేశాడు.

దీంతో నందితా సదరు నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు. నేను దేవతను కాదు.. నేను కూడా మాములు మనిషినే. అందరిలాగే నాకు కూడా బాధలుంటాయి.

నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నా.. దాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది.