
ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్. సీతా రామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ కూడా చెబుతున్నారు ఈ బ్యూటీ. సీతా రామం సినిమాలో మృణాల్‌ను చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ.

హోమ్లీ క్యారెక్టర్‌లో మృణాల్‌ను చూసి అచ్చమైన పదహారణాల తెలుగుతనం అంటూ పొగిడేశారు. అందుకే తరువాత చేసిన సినిమాల్లోనూ తెర మీద హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.

తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు. అందుకే చేసిన సినిమాలు తక్కువే అయినా అమ్మడి పేరు మాత్రం ఆన్‌లైన్‌లో గట్టిగా ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ కూడా ఇస్తున్నారు ఈ బ్యూటీ. వెండితెర మీద లాంగ్ టైమ్ కెరీర్ కంటిన్యూ అవ్వాలంటే గ్లామర్ ఇమేజ్ కూడా ఉండాల్సిందే అంటున్నారు మృణాల్.

అందుకే తెర మీద ఎక్కువగా హోమ్లీ రోల్సే చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు. క్యారెక్టర్ సెలక్షన్ విషయంలోనూ ఐయామ్ సో పర్టిక్యులర్ అంటున్నారు మృణాల్.

హీరోయిన్స్ స్టీరియోటైప్ రోల్స్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమొచ్చిందన్నది మృణాల్ వర్షన్. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవ్వగలమంటున్నారీ బ్యూటీ.