Kareena Kapoor: సౌత్ లో అదృష్టం పరీక్షించుకుంటున్న నార్త్ హీరోయిన్స్.. ఇప్పుడు కరీనా వంతు.!
దీపిక వచ్చేశారు.. దిశా పాట్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ అనన్య పలకరించారు. జాన్వీ ముస్తాబవుతున్నారు... మరి మీ రాక ఎప్పుడు? అని కరీనాని అడిగితే చిరునవ్వును సమాధానంగా విసురుతున్నారు. ఇంతకీ బెబో సౌత్ ఎంట్రీకి సర్వం సిద్ధమైనట్టేనా? నార్త్ లోనే కాదు, నేను సౌత్‌లో సినిమా చేసినా, వెయ్యి కోట్లు పక్కా అనే మాటను స్ట్రాంగ్‌గా చెప్పేశారు దీపిక పదుకోన్. కల్కి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగువారి హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు.