
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది ఈ అమ్మడు.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మగధీర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూశాకే పరిస్థితి లేకుండా వరుసగా ఆఫర్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా సత్యభామ. కాజల్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సుమన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని పాటను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. వెతుకు వెతుకు అంటూ సాగే వీడియో సాంగ్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

ఆ తరువాత కొంతకాలానికి నీల్ కుచ్లూ పుట్టడంతో.. కాజల్ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి.. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుంది.రీఎంట్రీ తరువాత లేడీ ఓరియెంటెడ్ మూవీ వస్తున్నా సత్యభామ.

ఈ సత్యభామ ప్రమోషన్స్‌లో పలు విషయాలు రివీల్ చేసారు కాజల్. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే వార్తలకు సమాధానమిచ్చారు.

అందులో భాగంగానే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏమిటని అడగగా.. కేవలం తారక్ కోసమే ఆ సాంగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.