
సోషల్ మీడియా కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్. రీసెంట్‌గా జాన్వీ పేరుతో ఉన్న సోషల్ మీడియా పేజ్ మీద కనిపించిన పోస్ట్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

దీంతో ఆ అకౌంట్ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది జాన్వీ. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మోస్ట్ హ్యాపెనింగ్ నేమ్ జాన్వీ కపూర్.

బాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. సౌత్‌లో మాత్రం టాప్ స్టార్స్‌తో జోడీ కడుతున్నారు. దీంతో ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

అదే సమయంలో జాన్వీ పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్‌లు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. రీసెంట్‌గా జాన్వీ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో కొన్ని అశ్లీల చిత్రాలు దర్శనమిచ్చాయి.

దీంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అయ్యారు. ఆ అకౌంట్‌కు బ్లూ టిక్ మార్క్ కూడా ఉండటంతో జాన్వీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా అన్న డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

ఎక్స్ పోస్టింగ్ విషయం జాన్వీ దృష్టికి వెళ్లటంతో ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. అసలు జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో అకౌంటే లేదని చెప్పింది ఆమె సోషల్ మీడియా టీమ్. జాన్వీ కేవలంలో ఇన్‌స్టాలో మాత్రమే ఉన్నారని, ఫేక్ అకౌంట్స్ విషయంలో మోసపోవద్దని కోరారు.