
సౌత్ ఎంట్రీ విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి దక్షిణాది వైపు చూస్తున్న ఈ బ్యూటీ, ఫైనల్‌గా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న జూనియర్ శ్రీదేవి, ప్రతీ చిన్న విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ ఆర్ హీరోల మూవీస్‌కి సైన్ చేసిన ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే చర్చ గట్టిగానే జరుగుతోంది ఇండస్ట్రీలో.

కంగువ కూడా క్లిక్ అయితే, ఇక్కడ ఈ భామకు తిరుగు ఉండదన్నది క్రిటిక్స్ చెబుతున్న మాట. వీళ్లందరి సంగతి సరే.. మా దేవర బ్యూటీ జాన్వీ గురించి కూడా చెప్పండి.

ఈ పాటలో జాన్వీ లుక్స్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు నార్త్‌లోనూ కనిపించనంత గ్లామరస్‌గా దేవర సాంగ్‌లో కనిపించారు జాన్వీ.

ప్రజెంట్ ఈ సాంగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దేవర సాంగ్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు జాన్వీ కపూర్. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాటతో చేసిన రీల్స్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తున్నారు.

తొలి అప్‌డేట్ విషయంలోనే జాన్వీ ఇంత ఎగ్టైట్ అవుతుండటంతో సౌత్ ఎంట్రీకి జాన్వీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్ధమవుతుందంటున్నారు విశ్లేషకులు.