
రోజురోజుకీ తెలుగు వారికి మరింత దగ్గరైపోతున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఎప్పుడు తిరుమలకు వచ్చినా లంగా ఓణీతో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే జాన్వీ కపూర్,

ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోలోనూ అదే లుక్‌తో మెస్మరైజ్ చేశారు. ఆమె మాట తీరుకు ఫిదా అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్. కొరటాల శివ రాసిన రెండు పేజీల డైలాగులను క్షణాల్లో చెప్పేశారు జాన్వీ.

ఆమె డైలాగ్ చెప్పిన తీరు చూసి నేను ఫిదా అయ్యాను. చాలా మంచి భవిష్యత్తున్న నటి అని రీసెంట్ ఇంటర్వ్యూలో తారక్ పొగుడుతూ ఉంటే, అందరూ వారెవా ఏం కాంప్లిమెంట్స్ అందుకున్నారు జాన్వీ.. అని ఆశ్చర్యపోయారు.

ఇదిగో ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కేన్సిల్ అయిన సందర్భంగా జాన్వీ ఇచ్చిన ఈ వీడియో బైట్ చూసి మరింత ఫిదా అయిపోతున్నారు.

కట్టుబొట్టులోనే కాదు, పలికే ప్రతి పదంలోనూ ఆమె తెలుగుకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇట్టే అర్థమైపోతోందని ఫిక్సయ్యారు. తెలుగులో దేవర పార్ట్ ఒన్ విడుదల కాగానే, చరణ్ తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్.

ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయన్నది ఆ మధ్య ఆమె చెప్పిన మాట. ఒకవేళ వాటిలో వేటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఓకే.. లేకుంటే ఎలాగూ దేవర పార్ట్ 2 ఉండనే ఉంది.

ఫ్యూచర్‌లో ప్రతి ఏటా తెలుగు సినిమాలు చేయడానికే ఫిక్సయిపోయినట్టున్నారు జాన్వీ కపూర్. అందుకే తెలుగును మరింత స్పష్టంగా నేర్చుకుంటున్నారన్నది క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్న మాట.

జస్ట్ మాట్లాడటం వరకే నేర్చుకుంటున్నారా? లేకుంటే, చదవడం రాయడం కూడా నేర్చుకుంటున్నారా? అన్నది అభిమానుల్లో కనిపిస్తున్న క్యూరియాసిటీ.