- Telugu News Photo Gallery Cinema photos AP Deputy CM Power Star Pawan Kalyan Joins in Shooting hari hara veera mallu shooting in Vijayawada, details here Telugu Heroes Photos
Pawan Kalyan: పవర్‌స్టార్ శక్తికి పరీక్షా.! మళ్లీ సెట్లోకి అడుగు.. కాల్షీట్లు సర్దుబాటు.!
ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అదంతా ఇవ్వని కిక్.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్ ఆర్మీకి. త్వరగా వచ్చేయండి బాస్ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్ స్టార్. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు.
Updated on: Sep 25, 2024 | 11:24 AM

ఏపీ పాలనలో భాగంగా పవర్‌స్టార్ ప్రతి రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే అదంతా ఇవ్వని కిక్.. ఇప్పుడు ఒక్క ఫొటో ఇస్తోంది పవన్ ఆర్మీకి.

త్వరగా వచ్చేయండి బాస్ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్ స్టార్. ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు.

ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్‌స్టార్. ముందంటూ ఒకటి మొదలైతే, ఆ వెనకే అన్నీ గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్.

తుఫాను ముందు ప్రశాంతత అంటూ ఆ పిక్స్ ని రిలీజ్ చేసింది. అతి త్వరలోనే షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు మేకర్స్ ఆల్రెడీ విజయవాడలో హరిహరవీరమల్లు సినిమా కోసం సెట్స్ వేశారు.

అక్కడే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 400 - 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా తెరకెక్కే దృశ్యాలు ఫ్యాన్స్ కి కన్నుల పండువగా మారనున్నాయి.

పవన్ కల్యాణ్ ఈ సినిమాలో శక్తిమంతమైన యోధుడిగా కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్‌స్టార్.

ముందంటూ ఒకటి మొదలైతే, ఆ వెనకే అన్నీ గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్.





























