తొలి సినిమాతోనే సౌత్‌లో స్టార్ హీరోలతో పోటికి రెడీ అవుతున్నారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్. ఎన్టీఆర్‌కు జోడిగా దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీని టాప్ బ్యూటీస్ సమంత, రష్మికతో కంపార్ చేస్తున్నారు ఫ్యాన్స్.
సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే సౌత్ డెబ్యూ విషయంలో ఊరిస్తూ వస్తున్నారు స్టార్ కిడ్ జాన్వీ కపూర్. నార్త్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎన్టీఆర్‌కు జోడిగా దేవర సినిమాతో సౌత్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా నుంచి జాన్వీ లుక్ రివీల్ అయ్యింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన వర్కింగ్ స్టిల్‌లో పరికిణీలో పక్కా పల్లెటూరి అమ్మాయిలా కనిపించారు జాన్వీ.
బాడీ లాంగ్వేజ్ కూడా మాసీగా ఉండటంతో జాన్వీది కాస్త రఫ్ అండ్ టఫ్ క్యారెక్టరే అన్న డెసిషన్‌కు వచ్చేశారు ఫ్యాన్స్. అదే సమయంలో రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన అందాల భామలను గుర్తు చేసుకుంటున్నారు.
పుష్ప సినిమాలో రష్మిక కూడా దాదాపు ఇలాంటి లుక్‌లోనే కనిపించారు. లంగా వోణీలో ఫుల్ మాస్ అమ్మాయిగా అదరగొట్టారు. పెర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్ షో విషయంలోనూ తగ్గేదే లే అన్నట్టుగా అలరించారు.
అందుకే నేషనల్ లెవల్‌లో బన్నీతో పాటు రష్మిక పేరు కూడా గట్టిగా రీసౌండ్ చేసింది. రష్మిక కన్నా ముందే సమంత కూడా ఇలాంటి లుక్ ట్రై చేశారు.
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం మూవీలో విలేజ్ గర్ల్ లుక్‌లో అదరగొట్టారు. ఈ సినిమాతో వర్సటైల్ బ్యూటీ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్నారు సామ్. ఇప్పుడు ఈ బ్యూటీస్‌తో పోటికి రెడీ అవుతున్నారు జాన్వీ.