కథ నచ్చితే.. కెప్టెన్ చెప్పిన కేరక్టర్‌లో ఒదిగిపోవాలని ఫిక్స్ అయితే యాక్టివిటీ రింగ్స్ అన్నీ కలర్‌ఫుల్ సర్కిల్స్ లో కనిపించేస్తాయి. మైండ్‌లో ఒక్కసారి ఫిక్స్ అయినప్పుడు చేసే ఎక్సర్‌సైజులు కూడా అలాగే ఉంటాయి మరి.. రెండున్నర గంటల పాటు స్క్రీన్ మీద ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో తెలుసా.? ఫ్యామిలీస్టార్‌లో స్క్రీన్ మీద పక్కింటబ్బాయిలా హాయిగా కనిపించారు విజయ్ దేవరకొండ.