డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మీద పూరి జగన్నాథ్ కెరీర్ ఎంత డిపెండ్ అయి ఉందో తెలియదు కానీ, రామ్ కి మాత్రం ఈ సినిమా సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రామ్ చేయబోయే సినిమాలంటూ ఒకటికి రెండు ప్రాజెక్టులు వైరల్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు రామ్ కెరీర్‌లో. అందుకే మళ్లీ సేమ్ ఫార్ములానే నమ్ముకున్నారు. ఆల్రెడీ లైగర్‌తో ఇబ్బందిపడ్డ పూరి జగన్నాథ్ తేరుకుని, డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు.