ఇండస్ట్రీలో మాస్ మహారాజా అని రవితేజను అంటారు కదా.! ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయనెవరో కాదు.. పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇదే జరుగుతుందిప్పుడు.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఈ సినిమాలో కూడా కామెడీకి పెద్దగా స్కోప్ ఉండే ఛాన్స్ లేనట్టుగానే అనిపిస్తోంది. అందుకే వరుసగా సీరియస్ రోల్స్ చేసి బోర్ ఫీల్ అయిన నాని, నెక్ట్స్ చేయబోయే సినిమాలో యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.
ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ఓజీని కూడా అదే జానర్‌లో చేస్తున్నారు. అందుకే సుజిత్ కూడా కాస్త రిలీఫ్ కోసం మళ్లీ కామెడీ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు.
దీనికోసం క్లాస్ కంటే మాస్‌నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు న్యాచురల్ స్టార్. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ చిత్ర షూటింగ్ మే లోపు పూర్తి కానుంది. ఆగస్ట్ 29న విడుదల కానుంది సినిమా. అంటే సుందరానికి ఫ్లాపైనా వివేక్‌పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని.
సుజిత్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారు నాని. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుజిత్ తరువాత సాహో సినిమాతో యాక్షన్ టర్న్ తీసుకున్నారు.
అయితే ఈ రెండు సినిమాల్లోనూ నాని కోర్ స్ట్రెంగ్త్ అయిన కామెడీ కాస్త తక్కువగానే ఉంది. ప్రజెంట్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరిపోదా శనివారం అనే యాక్షన్ మూవీ చేస్తున్నారు నేచురల్ స్టార్.